రిలే నిరహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్. మరియు మాజీ ఎమ్ ఎల్ ఏ కూన శ్రీశైలం గౌడ్ సంఘీభావం .

సాక్షి డిజిటల్ న్యూస్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ జనవరి 25. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో గత 4 రోజులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేస్తున్న రిలే నిరహార దీక్షకు ఈరోజు 5 వ రోజున రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్ దీక్షా శిబిరానికి వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరహార దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించి, ఈ విలీనం అంశాన్ని రాహుల్ గాంధీ తో చర్చించి, పార్లమెంటులో ప్రస్తావించి, కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం తెలిపి విలీనం అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తా అని కంటోన్మెంట్ ప్రజలకు హామీ ఇచ్చిన అనీల్ కుమార్ యాదవ్ కి ఎమ్మెల్యే శ్రీగణేష్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.