యువత మద్యం మరియు మత్తు పదార్థాలకు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు దూరంగా ఉండాలి వర్ధన్నపేట ఎస్సై సాయిబాబా

సాక్షి డిజిటల్ న్యూస్ . వర్ధన్నపేట . రిపోర్టర్ కుందూరు మహేందర్ రెడ్డి. జనవరి . 25. ఏడు రోజుల జాతీయ సేవా పథకము (NSS) శీతాకాల శిబిరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వర్ధన్నపేట ఆధ్వర్యంలో దమ్మన్నపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడు రోజుల శీతాకాల శిబిరంలో సందర్భంగా, ఆరవ రోజు వర్ధన్నపేట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్సై సాయిబాబా సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రత అనే అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కల్పించారు. నేటి యువత హెల్మెట్ ధరించకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా ముఖ్యంగా 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతూ విద్యార్థులకు హితబోధ చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ చూపాలని జీవితాన్ని క్రమశిక్షణతో కొనసాగించాలని. ప్రతి విద్యార్థి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని. అస్లీల వెబ్సైట్లు చూడరాదని. మత్తు పదార్థాలకు ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపరాదని హితబోధ చేశారు. ముఖ్యంగా యువత క్రికెట్ పై మోజుతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పు తీసుకుని. తిరిగి చెల్లించలేక యువత ప్రాణాలు కోల్పోతున్నారని. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని. విద్యార్థులు సైబర్ నేరాలు పట్ల రోడ్డు భద్రత పట్ల అప్రమత్తతో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మహేష్ నాయక్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు బాగా ఆడిక్తయి చదువు పైన శ్రద్ధ చూపలేదని. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో10వ తరగతి విద్యార్థులు మంచి పర్సంటేజ్ తో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మణిగి రెడ్డప్ప గారు విద్యార్థుల ఉద్దేశిస్తూ. ఈ ఏడు రోజుల శీతాకాల శిబిరంలో విద్యార్థులు క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగించాలని. హైపర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ ఉపయోగించరాదని. త్రిబుల్ రైడింగ్ చేయరాదని. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ యువత హెల్మెట్ ధరించకుండా ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని వాటి నివారణ మార్గము హెల్మెట్ ధరించడమేనని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దమ్మున్నపేట గ్రామస్తులు హైస్కూల్ విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.