సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 24, మండలంలో మొఖాస కొత్తపట్నం పంచాయతీ పరిధి పోతల వారు కల్లాల వద్ద వరి కుప్పల్లో మంటలు చెలరేగడంతో స్థానిక గ్రామస్తులు వెళ్లి మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు. వెంటనే వీఆర్వో రాజులమ్మ వెళ్లి పరిశీలించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ట్యాంకర్లతో మంటలు ఆర్పేశారు.స్థానికుల ఇచ్చిన సమాచారం ప్రకారం రోలుగుంట మండలం మోకాస కొత్తపట్నం గ్రామానికి చెందిన పోతల వెంకటస్వామి నాయుడు(చిన్న) గొలుగొండ మండలం కోదురుపాలెం గ్రామానికి చెందిన పొన్నాడ తాతిబాబు,వారి నాలుగు వరి కుప్పలు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించిరాణి రైతులు తెలిపారు.సుమారు 160 వరి బస్తాలు వస్తాయని అన్నారు.రూ.1 లక్షల ఆస్తి నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
