మృతుని కుటుంబానికి ఆర్థిక సాహయం అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ / జనవరి 25 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం గ్రామంలోని, సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్లో బస్ క్లీనర్ గా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కాటా జోజప్ప ఈ నెల 19వ తేదీన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. కాటా జోజప్ప నిరుపేద కుటుంబం కావడంతో, పాఠశాల లోని విద్యార్థులు, ఉపాద్యాయులు, బోధనేతర సిబ్బంది, మరియూ యాజమాన్యం అందరూ కలిసి 13000/- రూపాయలను అందజేశారు. ఈ సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు, పిల్లలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.