నూతనంగా ఎన్నికైన ఎస్ డి పి ఐ జాతీయ అధ్యక్షులు ఎం.కె.ఫైజి

★శుభాకాంక్షలు తెలియజేసిన మండల ఎస్ డి పి ఐ నాయకులు కార్యకర్తలు

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 25, హోళగుంద ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన జాతీయ అధ్యక్షులు ఎం. కే. ఫైజి జాతీయ కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర కార్యదర్శి యన్ సుబాన్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శనివారం ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్ హమీద్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జనవరి 20 21 రెండు రోజుల పాటు జరిగిన (ఎన్.ఆర్.సి) నేషనల్ రిప్రజెంటివ్ కౌన్సిల్ సమావేశంలో దాదాపుగా 15 రాష్ట్రాల నుండి ఎస్డిపిఐ పార్టీ యొక్క రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలుగా ఎస్డిపిఐ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన వర్గాల అభ్యున్నత కోసం, వారి సమస్యల కోసం అహర్నిశలు పోరాడుతున్న ఏకైక పార్టీ ఎస్ డి పి ఐ అన్నారు అలాంటి పార్టీని అనగదొక్కాలని బిజెపి ప్రభుత్వం దాదాపు 320 రోజులు అంటే 10 నెలలుగా జాతీయ అధ్యక్షులు ఎం.కె ఫైజీ తీహార్ జైల్లో పెట్టడం జరిగిందన్నారు. అయినప్పటికీ 15 రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర నాయకులు ఆరవ నేషనల్ రిప్రజెంటివ్ కౌన్సిల్ ( ఎన్ ఆర్ సి) సమక్షంలో మూడవసారి ఎం.కె ఫైజి జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు రాష్ట్రానికి చెందిన హఫీజ్ అతవుల్లా ఖాన్ కూడా జాతీయ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఆలూరు అసెంబ్లీ సభ్యులు బ్రాంచ్ నాయకులు కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన ఎన్నికైన ఎస్ డీ పి ఐ జాతీయ అధ్యక్షులు ఎం కె ఫైజీ జాతీయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన హాఫిజ్ అతవుల్లా ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్ ఉపాధ్యక్షులు సలాం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి హఫీజ్ కోశాధికారి అల్లా ప్రకాష్ అస్లం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.