మాడల్ స్కూల్ విద్యార్థి అదృశ్యం.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25 రొంపిచర్ల మండలం, రిపోర్టర్  భీమనేని బాలకృష్ణ, రొంపిచెర్ల మాడల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి అదృశ్యం అయ్యాడని రొంపిచెర్ల పోలీసులకు విద్యార్థి తండ్రి దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన దామోదర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి రొంపిచెర్ల బీసీ హాస్టల్లో ఉంటూ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో గురువారం హాస్టల్కు వచ్చి అనంతరం పాఠశాలకు వచ్చాడు. అయితే సాయంత్రం పాఠశాల నుంచి హాస్టల్కు వెళ్లాల్సిన విద్యార్థి పోలేదు. మరోసటిరోజు ఉదయం పాఠశాలకు విద్యార్ధి రాక పోవడంతో ఉపాధ్యాయులు విద్యార్ధి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రొంపిచెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.