మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కాపాడు ఉంటాం.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 రిపోర్టర్ సంజీవ్, అల్లూరి జిల్లా అరకులోయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటాం వీబిజి రామ్ జి స్కీమ్ ను రద్దు చేయాలి. 90%నిధులు కేంద్రప్రభుత్వమే భరించాలి.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005వసంవత్సరంలో వామపక్షాల మద్దతుతో యూపీఏ వన్ ప్రభుత్వ హయాంలో హక్కుగా సాధించుకున్న చట్టం దేశంలోనిపేద,మధ్యతరగతి గిరిజన ప్రజలందరికీ చట్టం ద్వారా వంద రోజులు పని ఉండేది పేద మధ్యతరగతి ప్రజల వ్యవసాయానికి పనికిరాని సంత భూముల్లో పనిచేసే వ్యవసాయయోగ్యంగా మార్చడం ద్వారా ఆ యొక్క రైతు లబ్ధి పొందాడు.అలాగే భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు లాంటి పనులు కల్పించడం ద్వారా ప్రజలందరికీ ఎంతో కొంత మేలు జరిగింది.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి బస్కి మాజీ ఎంపీటీసీ బురిడీ దశరథ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి కూలీలకు ఇంటింటి ప్రచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కి పంచాయితీ గుగూడు గ్రామంలో కరపత్రాలు పంచుతూ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోడీ మరియు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన విబిజి రాంజీ స్కీమ్ వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని పాత చట్టం ప్రకారం 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది కానీ కొత్తగా తీసుకువచ్చిన స్కీం లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలని తెలియజేస్తుంది . ఇప్పటికే రాష్ట్రము ఆర్థిక లోటుతో అనేక హామీలు ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు ఈ కేటాయింపులతో మరిన్ని ఆర్థిక భారం పెరగడంతో నిధులు కేటాయించక ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించిందని ఉపాధి హామీ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయనివ్వమని కేంద్రం మెడలు వంచాయిన చట్టాన్ని సాధించుకుంటామని తెలియజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి ఒక కుటుంబానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు వేతనంగా చెల్లించాలని అలాగే పని ప్రదేశంలో టెంట్లు, ప్రధమ చికిత్స పెట్టే,గునపాలు,పారలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిల్లో. రఘునాథ్, పూజారి. చందర్, పూజారి.అప్పన్న,బురిడీ. స్వామి,పూజారి. సద్దు, పాంగి.రాందాస్, బురిడీ. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.