సాక్షి, డిజిటల్ న్యూస్ ,జనవరి, 25,2026 (రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఓటరు దినోత్సవం పురస్కరించుకొని శనివారం నాడు మరికల్ పట్టణంలోని వివిధ వార్డులలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివశంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.