బ్లో అవుట్ బాధితులకు ఓఎన్జిసి ఎక్స్ గ్రేషియా రూ.10 వేలు

★జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
అమలాపురం ఈనెల 5వ తేదీన ఇరుసుమండ గ్రామం లో సంభవించిన బ్లో అవుట్ బాధిత 6300 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10,000 చొప్పున ఓఎన్జిసి ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు శనివారం స్థానిక కలెక్టరేట్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఓఎన్జిసి ప్రకటించిన ఎక్స్ గ్రేషియా గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5 న మామిడికుదురు మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జిసి మోరి 5 బోరు బావిని డీప్ ఇండస్ట్రీస్ వారికి లీజుకు ఇవ్వగా వారు పెర్పరేషన్ చేస్తుండగా బోరుబావి నుండి ఉదయం 11:30 గంటలకు గ్యాస్ లీక్ కావడం అనంతరం 12:30 గంటలకు బ్లో అవుట్ మంటలు వ్యాపించి సుమారు నాలుగు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని సురక్షిత ప్రాంతాలకు చేరుకొని మూడు రోజులపాటు పునరావసం పొందారని తెలిపారు. ఇరుసుమండ, గుబ్బల పాలెం, లక్కవరం, చింతపల్లి గ్రామాలకు చెందిన బ్లో అవుట్ ప్రభావిత గ్రామాలకు చెందిన 6,300 కుటుంబాలు వద్ద ఓఎన్జిసి ప్రతినిధులు బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి ఫిబ్రవరి మొదటి వారంలో ఎక్స్గ్రేషియా వారి వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి బ్లో అవుట్ సంభవించిన తీరుతెన్నులను ప్రజా ప్రతినిధులను జిల్లా యంత్రాంగం ఓఎన్జిసి ప్రతినిధులను అడిగి తెలుసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రజా శ్రేయస్సు కోరి తీసుకోవాలని సూచించి ఉన్నారన్నారు.జరిగిన సంఘటన పట్ల పరిహారాలు అందించాలని ఓఎన్జిసి అధికారులకు సూచించిన మీదట ఈ యొక్క పరిహారాలను అందించడం జరుగుతుందన్నారు రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ప్రసంగిస్తూ 5 లక్షలు వైద్య బీమా అందించాలని లక్కవరం గ్రామంలో ఉన్న 2.57 ఎకరాలు విస్తీర్ణంలో ఓఎన్జిసి బ్రాండ్ పేరిట మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రిని 60 గ్రామాల ప్రజలకు అనువుగా నిర్మించాలన్న అభ్యర్థనకు ఓఎన్జిసి అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. ఈనెల 5వ తేదీన జరిగిన సంఘటన పట్ల ఓఎన్జిసి బ్లో అవుట్ నియంత్రణ బృందం చాకచక్యంగా వ్యవహరించి ఐదు రోజులలో బోరుబావికి క్యాప్ బిగించడంతో ఈ 4 గ్రామాల ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్నారు. గ్యాస్ నిక్షేపాలు వెలికి తీస్తున్న బోరు బావులు మరియు, రీ ఓపెన్ పెర్పరేషన్ చేసేటప్పుడు ఆ వివరాలను సమీపంలోని ప్రాంతాల వారికి ముందుగా తెలియ చేయడంతో పాటుగా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ తో అప్రమత్తం గా వ్యవహరించాలని అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు జిల్లా యంత్రాంగానికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంలో ఎక్స్ గ్రేషియా అందించడం లో కొంచెం జాప్యం జరిగిందని అన్నారు. ఓఎన్జిసి రాజమండ్రి సెక్షన్ కార్యనిర్వాహక ఇంజనీర్ శాంతానో దాస్ మాట్లాడుతూ ఓఎన్జిసి చమురు సహజవాయువుల నిక్షేపాలను వెలికి తీసే సందర్భంలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తుందని, ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు.క్రైసెస్ మేనేజ్మెంట్ బృందం ఎంతో చాకచక్యం గా ఇటువంటి సందర్భాలలో వ్యవహరించి మంటలను అదుపులోనికి తెచ్చిందన్నారు.ఇకపై పబ్లిక్ సెక్టార్ లో కార్యకలాపాలు నిర్వహణ సందర్భంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమన్వయంతో డ్రిల్లింగ్ ప్రక్రియలో ఉపద్రవాల సంభవించకుండా రక్షణ జాగ్రత్త చర్యలు కూడా పటిష్టమైన భద్రతా చర్యల నడుమ చమురు సహజ వాయువుల వెలికితీత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంచి కమిట్మెంట్ ప్రికాషన్స్ తో మానిటరింగ్ వ్యవస్థను చేపడతామని తెలిపారు.