బోరు మోటర్ కు మరమ్మత్తులు

★పదవ వార్డు సభ్యురాలు పబ్బు అరుంధతి శ్రీకాంత్ గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి, వలిగొండ పట్టణ కేంద్రంలోని పదో వార్డులో మారెమ్మ ఆలయం ముందు గత కొన్ని నెలలుగా నిరుపయోగంగా బోరు మోటర్ పాడై ఉండడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు పదో వార్డు సభ్యురాలు పబ్బు అరుంధతి శ్రీకాంత్ గౌడ్ బోరును ఉపయోగం లోకి తీసుకువస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం మరమత్తులు చేయించి చేతి పంపును బిగించారు. దీంతో వార్డు ప్రజలు అరుంధతి శ్రీకాంత్ గౌడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని వరుణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్నపాక నరేందర్, మైసొల్ల వినోద్ కాలనీవాసులు హనుమంతు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.