బుగ్గారం సాంబ శివ పంక్షన్ హాల్ నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు

★మంత్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన బుగ్గారం గ్రామస్థులు

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి మంత్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్
జగిత్యాల జిల్లా, బుగ్గారం మండల కేంద్రంలో శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు 20లక్షలు మంజూరు చేయించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తమ సంతోషాన్ని తెలిపిన బుగ్గారం గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల సుభాష్. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య, ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్,కోడిమ్యాల రాజన్న, తాడెపు లింగన్న ,దసర్తి పోసన్న, పోనకంటి కైలాసం, బెజ్జారపు రాజు, పెద్దనవేణి రాగన్న నక్క శంకర్, పరుమాల సత్తన్న, సమీద్ ఇతర నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.