బీసీ సంఘం మండల అధ్యక్షులుగా పెనుగొండ సాంబశివరావు నియామకం.

*బీసీల సంక్షేమమే ధ్యేయం పెనుగొండ.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మణుగూరు మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పెనుగొండ సాంబశివరావు నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సాంబశివరావు కు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రిగా అరుణ్ కుమార్ ,తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి బొల్లినేని రాజేష్ యాదవ్ పాల్గొన్నారు.నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం పెనుగొండ సాంబశివరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఆర్. కృష్ణయ్య,డాక్టర్ రిగా అరుణ్ కుమార్ లకు, బొల్లినేని రాజేష్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మణుగూరు మండలంలో బీసీ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తానని , క్షేత్రస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *