బీటీపీ కాలువ పనులు తిరిగి ప్రారంభమైనందుకు 501 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే అమిలినేని అభిమాని

సాక్షి డిజిటల్ న్యూస్, కళ్యాణదుర్గం జనవరి 25, అనంతపురం జిల్లా ఇంచార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ముందు అమిలినేని సురేంద్ర బాబు చెప్పిన విధంగా బీటీపీ కాలువ పనులు మొదలవడంతో మొక్కులు చెల్లించిన తిమ్మానాయుడు కాశీ విశ్వేశ్వర ఆలయం కొబ్బకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న అభిమాని, పాల్గొని స్వామి దర్శనం చేసుకున్న ధర్మతేజ
కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం, ఈ ప్రాంత జీవనాడి భైరవాణితిప్ప ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమై పనులు జరిగితే ఆ పరమశివుడికి 501 కొబ్బరికాయలు కొడతానని దురదకుంట గ్రామానికి చెందిన తిమ్మానాయుడు మొక్కుకున్నారు.నేడు బీటీపీ కాలువ పనులు శరవేగంగా ముందుకు సాగుతుందటంతో అనంతపురం పట్టణంలోని ఒకటో రోడ్డులో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ హాజరు కాగా స్వామి 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుని స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు..