
సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, జనవరి: 25( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసాల ఆంజనేయులు ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళా విద్యార్థులను సాధికారికత వైపు నడిపించడానికి చేపట్టిన పీఎం ఉష థర్డ్ (బిఎపి) ప్రోగ్రాం శుక్రవారం స్థానిక వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరిక ప్రపంచ ములో మహిళలను తక్కువగా చూడబడడానికి అవకాశం లేదని, విద్యార్థి దశ నుంచే వారిని వృత్తి విద్య కోర్సులలో నైపుణ్యం చేకూర్చినట్లైతే సమసమానత్వం ఏర్పడుతుందని ఉద్దేశ్యంతో పిఎం ఉషా ప్రోగ్రామును ప్రభుత్వాలు ప్రారంభించాయనీ పేర్కొన్నారు. పీఎం ఉషా ప్రోగ్రాము మంజూరు చేసిన కళాశాలలో తమ కళాశాల కూడా ఒకటని, దానికి మేము అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామని అని తెలియజేశారు. మహిళా విద్యార్థులకు సరిపడే వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఒకటైన టైలరింగ్ కోర్సు ప్రారంభించడం జరిగిందని అన్నారు. వంద మంది విద్యార్థులు దాదాపు 30 రోజులు కాలం పాటు ఉన్నత విద్యా కమిషన్ రేట్, అమరావతి వారు నియమించిన ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ ఆధీనంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు. అలాగే పీఎం ఉష కోర్స్ కోఆర్డినేటర్ డా. కే.సతీష్ మాట్లాడుతూ ఈ 30 రోజుల పాటు ప్రభుత్వం వారు జారీ చేసిన కుట్టుమిషన్ల తో విద్యార్థినీలు సముచితమైన శిక్షణ అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ పాయింట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒప్పందం కుదుర్చుకొని నాగలక్ష్మి, వాణిలను 30 రోజులు కాలం పాటు వస్త్రాల కటింగ్, వస్త్రాలు కుట్టుట మరియు వివిధ రకాల వస్త్రాల డిజైనింగ్ మొదలగు విషయాల పట్ల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్ కోర్స్ కు రిజిస్టర్ చేయించిన 100 మంది విద్యార్థులతో పాటు తదితరులు హాజరయ్యారు అనంతరం డా. బాలకొండ గంగాధర్, డా. మల్లేశ్వరమ్మలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. సుధాకర్, డా శ్రీకాంత్, డా. నాగలక్ష్మి దేవి, డాక్టర్ మాధవరావు, పీడీ తేజేంద్ర, రాజారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.