పులికనుమ జలాశయం నుంచి ఎల్ ఎల్ సి కి మూడు నాలుగు రోజుల్లో నీరు విడుదల

★డిసీ చైర్మన్ మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 25, పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న రబీపంటను కాపాడుకోవడా నికి సాగునీరు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి, అధికారులతో మాట్లాడి మూడు, నాలుగు రోజుల్లో పులికనుమ ప్రాజెక్టు నీరును రైతులు అవసరానికి ప్రస్తుత పంటను కాపాడుకోవడానికి విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది నరవ రమాకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 28వ తారీఖున సాగునీటి సంఘ అధ్యక్షులకు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు ఇది మా ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత. గత ప్రభుత్వంలో రైతులునుగాని, సాగునీటి సంఘాలు గాని, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుని కాని పట్టించుకున్న దాఖలాలు లేవు. సాగునీరు విడుదల చేసి రైతుల పంటలు కాపాడుతున్న ముఖ్యమంత్రికి, నీటి శాఖ మంత్రికి, అధికారులకు రైతుల తరఫున డిసీ చైర్మన్ మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.