పాల్వంచ మండలం పేట చెరువు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం.

★హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.

సాక్షి డిజిటల్ న్యూస్: 25 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పేట చెరువు గ్రామంలో మైత్రి సెంటర్ వద్ద శనివారం ఉచిత పశువైద్య శిబిరం జరిగింది. మండల పశువైద్యాధికారి డాక్టర్ రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు వేసి, ఉచిత మందులు పంపిణీ చేశారు. పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పశువైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా అనేక పశువులకు వైద్య సేవలు అందడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.