
సాక్షి డిజిటల్ న్యూస్ 25 మల్దకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు సర్పంచ్ పద్మా వెంకటేష్,నాయక్ అధ్యక్షతన గ్రామసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అంగన్వాడీ టీచర్స్ ఉపాధి హామీ టెక్నికల్ ఆఫీసర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. , ప్రధాన ఎజెండా చర్చ:- సభలో ముఖ్యంగా ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు పనులు త్రాగునీటి సమస్యలు అంగన్వాడి మూడు సెంటర్లలో ఆయ లేరు కాబట్టి టీచర్‌కు మీటింగ్ ఉన్నప్పుడు పిల్లలకు ఇబ్బంది అయితుంది అని అంగన్వాడి టీచర్ మాట్లాడం జరిగింది అలాగే తాండ స్కూల్లో సింగల్ టీచర్ 41 మంది పిల్లలకు ఇద్దరినీ నియమించాలని ఎంపీ ఓ కు తాండ ఉపాధ్యాయుడు నియమించాలని కోరారు. . తండాలో ఎంపీ ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలో నీళ్లు వదలాలి రోడ్లపై రావద్దు అని అన్నారు. విద్యుత్ సమస్య : కెనాల్ పై ఉన్న ట్రాన్స్ఫారంలు వైర్లు నేలపై ఉండడం వల్ల ఆవులు మేకలు మనుషులు పొరపాటున అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వైర్లను తీసేయగలరు అని కరెంట్ లైన్ మాన్ గ్రామ సర్పంచ్ కు కోరారు గ్రామ సభలో గ్రామ పెద్దలు యువకులు తదితులు పాల్గొన్నారు.