నాగాపురంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

సాక్షి డిజిటల్ న్యూస్, సి హెచ్ నాగాపురం గ్రామంలో శనివారం పశు ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఔషధాలను పంపిణీ చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామంలోని పశుపాలకులకు పశువుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు తగిన వైద్య సేవలు అందించడమైందని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో పశు వైద్య సిబ్బంది గ్రామ పెద్దలు సహకరించారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్,రైతులు కొంకిపూడి ప్రకాష్,వీసం తాతారావు పాల్గొన్నారు.