సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 మంచిర్యాల జిల్లా రిపోర్టర్ రావుల రాంమోహన్…. ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన వినతి మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పోస్ట్ ఆఫీస్ లో మేనిఫెస్టో అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులువేసారు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పిన అంశాలు 1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధతతో కూడిన మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, 2) ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ లో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం అమలు చేస్తామని, 3) విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూసికత్తులేని పది లక్షల వరకు రుణాలు అందిస్తామని,4) ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని,5) అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో బీసీ భవనాలు నిర్మిస్తామని,6) ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, 7) బీసీ ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి పది లక్షల ఆర్థిక సహాయం చేస్తామని, 8) స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తామని,9) జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని, ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అంటే బీసీ సమాజాన్ని నమ్మించి మోసం చేయడమే అవుతుంది. ఇప్పటికైనా మేనిఫెస్టోను అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ పోరాట హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, సదానందం, రామగిరి రాజన్న చారి, చెలిమెల అంజన్న, వేముల అశోక్, కీర్తి బిక్షపతి, సంతోష్, సత్యనారాయణ, అంకం సతీష్,ఆరిందల రాజేశం, ధర్మాజీ మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు