సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25: వేములవాడ పట్టణం. రిపోర్టర్: అక్కనపల్లి పరశురాం.. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వాహనదారుల సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్బంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో వేములవాడ పట్టణంలో అరైవ్.. అలైవ్.. అలెర్ట్, రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2కే వాకథాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం పై విద్యార్థులు డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో జరిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. 2కే వాకథాన్ ను ప్రభుత్వ విప్, చొప్పదండి ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ జెండా ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తా నుంచి కోర్ట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మైదానం వరకు ముఖ్య అతిథులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు.