
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు, శనివారం జాతీయ రోడ్డు భద్రత
మాసోత్సవం సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోస్హమ్మమైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్. డాక్టర్ సత్య శారద, ప్రారంభించారు. మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెంట్ వాహనాలకు సంబంధించిన తదితర పేపర్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు
డబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి,ఏసీపీ శుభం, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి సాంబశివరావు వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.