సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ జిల్లా ఉపాధ్యక్షులు బిటి దొర అన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు అనకాపల్లి జిల్లాలో నా షెడ్యూల్ ఏరియాలో గిరిజన రైతులు జీడి పంటలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు జీడి పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీడిపంటకు పెట్టుబడికి అధిక వడ్డీలకు వ్యాపారం నుండి రుణాలు తీసుకొని అవి తీర్చలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గిరిజన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు అనంతరం గరిసింగి వాలాబు పంచాయతీల్లో జీడిపెక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని విస్తృతంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో చెరకు శ్రీను జన్ని భైరవ మూర్తి జర్నీ దేవుడు ఎనుకల గంగరాజు తదితరులు పాల్గొన్నారు