
సాక్షి డిజిటల్ న్యూస్: 25 జనవరి 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష తుళ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందడం సందర్శించారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజులప్రణాళిక అమలు తీరును, విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా ప్రధానో పాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు పదవ తరగతి విద్యార్థులు ధైర్యంగా పరీక్షకు వెళ్లే విధంగా పలు సూచనలు సలహాలు అందించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందడం మరియు మంగళగిరి లోని మునిసిపల్ ఉన్నత పాఠశాల WC లో జరుగుతున్న క్లస్టర్ సమావేశాలను పరిశీలించి సమావేశాలు పక్కగా ప్రణాళిక ప్రకారము జరగాలని ఈ సమావేశాలు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఇక్కడ నేర్చుకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు