జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కె.కోటపాడు మండలంలోని గొండుపాలెం, గుల్లేపల్లి, కొరువాడ గ్రామాలు మరియు కె.కోటపాడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల దుష్పరిణామాలు, ఆడపిల్లల విద్య ప్రాధాన్యత, పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలు, వ్యక్తిగత పరిశుభ్రత, మంచిచెడు స్పర్శలపై విద్యార్థినిలకు వివరించారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తూ, ప్రతి బాలిక చదువుతో స్వయం ఆధారంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కె.కోటపాడు మహిళా, శిశు సంక్షేమ ప్రాజెక్ట్ అధికారి లలిత కుమారి, పర్యవేక్షకులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఉపాధ్యాయినులు పాల్గొని విద్యార్థినిలకు మార్గనిర్దేశం చేశారు.