
సాక్షి డిజిటల్ న్యూస్ జిల్లా:వనపర్తి, మండలం:చిన్నంబావి, రిపోర్టర్:క్రాంతి కుమార్, చిన్నంబావి మండలం లో జరిగిన రోడ్డు భద్రతా దినోచ్చవాల్లు మరియు జాతీయ బాలికల దినోచ్చవం ఘనంగా జరిపారు,వివేకానంద హై స్కూల్ ప్రిన్సిపాల్ లింగస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు,ఇటు జాతీయ బాలికల దినోచ్చవంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాలికలు పురుషులకు సమానంగా ఉన్నారు.ప్రతి కాంపిటీషన్ ఎగ్జాంలో బాలికలు పోటీ ఇస్తున్నారు, ఎవ్వర్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు పురుషులు,బాలికలు,ఉన్నతా విద్యా మంచిగా చదువు కొని తల్లి దండ్రులకు మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,అలాగే రోడ్డు భద్రతా విషయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వెళ్లాలని కోరుకుంటున్నాను, మీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురు చూస్తుంటారు,కాబట్టి జాగ్రత్తలు వహించండి అని వివేకానందా హై స్కూల్ ప్రిన్సిపాల్ లింగాస్వామి తెలిపారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్నంబావి మండల పోలీస్ వారు సహకరించి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..