సాక్షిడిజిటల్ న్యూస్,జనవరి 25,రాయికల్,వై.కిరణ్ బాబు: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విలేఖరులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మరియు అట్టి స్థలంలో ఇండ్లు మంజూరు చేయాలని, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కు స్థలం కేటాయించాలని కోరుతూ రాయికల్ ప్రెస్ క్లబ్ (జె ఎ సి) సభ్యులు కార్యవర్గం సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. రాయికల్ పట్టణం లోని డబుల్ బెడ్ రూమ్ దగ్గర ఖాళీగా ఉన్న దాదాపు రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది . అట్టి భూమిలో అనేక సంవత్సరాల నుండి జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం కోరుతున్నప్పటికీ స్పందన లేదు. అనేక మంది జర్నలిస్టులు స్వంత ఇల్లు లేక అద్దె ఇండ్ల లో కాలం వెల్లదీస్తున్నారని తమరు స్పందించి ఖాళీగా ఉన్న అట్టి స్థలాన్ని కేటాయించ గలరని మరియు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోరకు తహసీల్దార్ కార్యాలయం రోడ్ లో ఉన్న బస్టాండ్ వద్ద ఖాళీగా ఉన్న స్థలాన్ని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతకుంట సాయికుమార్,ప్రధాన కార్యదర్శి సింగిడి శంకరయ్య,కోశాధికారి కడకుంట్లజగదీశ్వర్ ,ఉపాధ్యక్షులు సింగని శ్యామ్ సుందర్, యాచమనేని కిరణ్ బాబు, సహా కార్యదర్శి తిరుమల శంకర్,అధ్యక్షులు సయ్యద్ రసూల్, మాజీ అధ్యక్షులు వాసరి రవి,మాజీ కోశాధికారి మచ్చ శేఖర్ సభ్యులు అందె రంజిత్ తీగుల్ల గోపి ,గన్నవరం గంగాధర్,ఓరుగంటి భీమ్ రాజ్, అనుపురంలింబాద్రి. ఎం.డి ఇర్ఫాన్, గట్టుపల్లి నరేష్ ,గంట్యాల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.