సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు అమలాపురం సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీనర సింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈనెల 27 నుండి ఫిబ్రవరి రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జిపై బస్సుల రాక పోకలు పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్నందు ఆర్టిసి రహదారులు భవనాల శాఖ, పోలీసు ఉన్నతాధికారులతో అధికారులతో సమావేశం నిర్వహించి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవ భక్తుల రాక పోకల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నoదున వారి సౌకర్యార్థం మరమ్మత్తులలో ఉన్న చించినాడ బ్రిడ్జిపై 5 రోజులపాటు తాత్కాలికంగా బస్సులు రాకపోకలకు సుమారు 16 టన్నుల బరువుతో అనుమతించాలని ఆదేశించారు.గోదావరి నదిపై భద్రత దృష్ట్యా పంట్లు పై ప్రయాణాలను నిరోధించాలన్నారు. చించినాడ వంతెన పై మార్కింగ్ ఇస్తూ, ఆ మార్కింగ్ లోనే బస్సులు రాకపోకలు సాగించేలా మానిటరింగ్ వ్యవస్థను పోలీసులు ఆర్టీసీ వారి సమన్వయంతో అమలు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాకపోకలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ ప్రసాద్, జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు ,ఆర్టీసీ డిపో మేనేజర్లు ఎం.శ్రీనివాసరావు ఎం.భాస్కర రావు వైవివిఎస్ కుమార్ జేమ్స్ డిఎస్పి మురళీమోహన్, జాతీయ రహదారులు సహా ఇంజనీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.