సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 25,, శంకరపట్నం,, కరీంనగర్ జిల్లా,, శంకరపట్నం మండలంలోని వంకాయ గూడెం గ్రామంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ లో పూర్తిగా గోల్మాల్ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు,, సర్పంచి ఎన్నికల్లో ఇందిరమ్మ చీరలు పంపిన వ్యవహారం చిచ్చు పెట్టడంతో గ్రామంలో చర్చనీయ అంశంగా మారింది, ఇటీవల జరిగిన గ్రామపంచాయ తి,ఎన్నికల్లో సర్పంచ్ బరిలో ఉన్న పోటీదారులు నువ్వా నేనా అనే చందంగా పోటీ కొనసాగింది,, . ఎన్నికల కోడు కు వ్యతిరేకంగా ఇందిరమ్మ చీరలను ఏకపక్ష నిర్ణయాలతో రాత్రికి రాత్రి పంపిణీ చేసి సర్పంచ్ పోటీలో ఉన్న ఓ పోటీదారునికి అనుకూలంగా పంపిణీ చేసి గెలుపొందుటకు కీలకపాత్ర పోషించినట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలిపారు ,, పార్టీలకు అతీతంగా వ్యవహరించే ఓ పొదుపు సంఘం మహిళా గ్రూపుకు చెందిన ఓ లీడర్ ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు వారు తెలిపారు,, అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి, డబ్బులు కూడా ఓ పోదు సంఘం లీడర్ పంపిణీ చేసి సర్పంచ్ పోటీలో ఉన్న పోటీదారుడు గెలుపుకు కీలకంగా వ్యవహరించడం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు, ఇందుకు బాధ్యత వహించిన పొదుపు సంఘం లీడర్ ను తొలగించే విధంగా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు.