గ్రామపంచాయతీ దుకాణ సముదాయాలకు బహిరంగ వేలం పాట

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి గ్రామపంచాయతీకి చెందిన ఆరు దుకాణ సముదాయాలకు గ్రామ సచివాలయం ఆవరణలో ఎంపీఓ,సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం బహిరంగ వేలంపాట నిర్వహించారు.ఈ వేలంపాటలో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొని గ్రామపంచాయతీ సముదాయాలను అధిక వేలం పాట పాడి స్వంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బహిరంగ వేలంపాట పాడి గ్రామ ప్రజలు దుకాణ సముదాల సొంతం చేసుకున్నం దుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలోగ్రామపంచాయతీ అధికారులు ఎంపిఓ రాజేష్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెద్ద శ్రీకాంత్, సెక్రటరీ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.