గౌతమ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ క్లినిక్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

★క్యాలెండర్ ను ఆవిష్కరించిన తుంగతుర్తి రవి…..

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25/2026 మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, పిర్జాదిగూడ లోని డాక్టర్ ఇమ్మడి రమేష్ స్థాపించబడిన గౌతమ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ క్లినిక్ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను ఆర్ వి ఫౌండేషన్ మరియు పిర్జాదిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించబడింది తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. గౌతమ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ సేవలు ఎంతో అమోగమనీయమైనవి అని కొనియాడుతూ నీరు పేదలకు తక్కువ ధరలకే వైద్యం అందించాలని డాక్టర్ ఇమ్మడి రమేష్ని కోరారు. అందుకు డాక్టర్ ఇమ్మడి రమేష్ స్పందిస్తూ అనేకమార్లు ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసి నీరుపేదలకు సేవ చేస్తున్నమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులసరి వీరయ్య, కిన్నెర రవీందర్, తలారి ప్రవీణ్, మరియు అడ్వకేట్ నాగరాజు, శ్రీకాంత్ పటేల్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.