గాజువాకలో డ్రైవర్ల దృష్టి పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ హుస్సేన్

సాక్షి డిజిటల్ విశాఖ ప్రతినిధి సంజయ్ గాజువాక: రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా గాజువాక వాసన్ ఐ కేర్ హాస్పిటల్ లో వాహన డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శుక్లo శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ హుస్సేన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నెలరోజుల ఉచిత కంటి పరీక్షల శిబిరానికి సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్ కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాసన్ ఐ కేర్ సంస్థ సామాజిక సేవను చేపట్టడం అభినంద నీయమని అన్నారు.డ్రైవర్లు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ముందుకు రావాలని కోరారు. రోడ్డుపై వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి.లక్ష్మీ ప్రియ మాట్లాడుతూ కంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు. హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న డ్రైవర్ దృష్టి పరిశీలన కార్యక్రమం చాలా గొప్పదని తెలిపారు. తమ సంస్థ చేపడుతోన్న కంటి వైద్య సేవను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వైద్యులు విఎన్ అనీమా, పి ప్రమోద్, సిహెచ్ వాణి, వాసన్ ఐ కేర్ ఏపీ డీజీఎం కె వెంకట రామారావు, గాజువాక సెంటర్ హెడ్ పి సంతోష్ సాయి కుమార్, పి స్వామి వందనం,వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.