కామారెడ్డి అభివృద్ధియే నా ధ్యేయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ…

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి(25) కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్. రూ. 65.80 కోట్లతో అమృత్ 2.0 పనులకు షబ్బీర్ అలీ శంకుస్థాపన ​కామారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద రూ. 65 కోట్ల 80 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ​తాగునీటి సౌకర్యం కోసం భారీ కేటాయింపులు ​పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నాలుగు నూతన భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
​ఇస్లాంపుర కాలనీ: 5 లక్షల లీటర్ల సామర్థ్యం (రూ. 1.02 కోట్లు) ​లిటిల్ స్కాలర్ స్కూల్ ప్రాంతం: 5 లక్షల లీటర్ల సామర్థ్యం (రూ. 1.03 కోట్లు) ​గ్రీన్ సిటీ కాలనీ: 5 లక్షల లీటర్ల సామర్థ్యం (రూ. 1.02 కోట్లు) ​డ్రైవర్స్ కాలనీ: 5 లక్షల లీటర్ల సామర్థ్యం (రూ. 1.02 కోట్లు) ​వీటితో పాటు పట్టణంలోని వికాస్ నగర్ మరియు లింగాపూర్ వార్డులలో సిసి రోడ్ల నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. ​అభివృద్ధే చరిత్రలో నిలుస్తుంది: షబ్బీర్ అలీ ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ​ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. మనుషులు కూడా శాశ్వతం కాదు. కానీ మనం చేసే అభివృద్ధి పనులు మాత్రమే కలకాలం నిలిచిపోతాయి. ప్రజల అవసరాలను గుర్తించి పని చేసినప్పుడే మన పేరు చరిత్ర పుటల్లో నిలుస్తుంది
​రాజకీయం అనేది నీతిగా, నిజాయితీగా ఉండాలని, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడమే అసలైన విజయమని ఆయన పేర్కొన్నారు. ​నేను ఎప్పుడూ కుల మత రాజకీయాలకు దూరంగా ఉంటాను. అభివృద్ధి విషయంలో వివక్షకు తావు లేదు. అందరికీ సమానమైన ఫలాలు అందాలన్నదే నా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ​అభివృద్ధే నా గుర్తింపు కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, కేవలం మాటలతో కాకుండా పనులతోనే ప్రజల మెప్పు పొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు…