కళాకారుల శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

★ఫిబ్రవరి 1న తాడేపల్లిగూడెంలో ★రాష్ట్ర బహుజన కళామండలి పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, ప్రజా చైతన్యం కోసం పాట చాలా శక్తివంతమైనది. వంద ప్రసంగాలు కంటే ఒక పాట గొప్పది. మహనీయుల ఆశయాలకై కళాకారులు మరింత సాహిత్యంను పదునెక్కించాలని రాష్ట్ర బహుజన కళామండలి సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న తాడేపల్లిగూడెంలో జరిగే శిక్షణ తరగతులకు కళాకారులు హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర బహుజన కళామండలి ప్రధాన కార్యదర్శి ఆతవ ఉదయ భాస్కర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కాటపల్లి అప్పారావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని అంబేద్కర్ భవనంలో కళాకారుల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఆసక్తిగల కళాకారులు హజరుకాగలరని కోరారు. వివరాలకు : 9704125989, 9491332885 ఫోన్ నెంబర్ల కోసం సంప్రదించాలని తెలిపారు.