ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చిన చిల్వకోడుర్ గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భైరం నారాయణ 25 జనవరి 2026, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన ప్రజలకి వరి ధాన్య కొనుగోలు సెంటర్ మరియు సమ్మక్క సారలమ్మ జాతరకు స్థలం లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తనని చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో అట్టి భూమిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తారని హామీ ఇచ్చిన దాసరి తిరుపతి గౌడ్. గెలిచిన తర్వాత అట్టి విషయమై గ్రామంలోని ప్రభుత్వ భూమిని వరి ధాన్య కొనుగోలు సెంటర్ మరియు సమ్మక్క సారలమ్మ జాతర కొరకు ఆ భూమిని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి విన్నవించగా మంత్రివెంటనే స్పందించి అధికారులను అట్టి భూమిని వరి ధాన్య కొనుగోలు సెంటర్ మరియు సమ్మక్క సారలమ్మ జాతరకు కేటాయించాలని ఆదేశించగా నేడు దానికి సంబంధించిన ఆర్డర్స్ రావడంతో పాటు అట్టి భూమిని రాబోతున్న సమ్మక్క సారలమ్మ జాతర కొరకు చదును పనులను ప్రారంభించడం జరిగిందని చిల్వకోడూర్ గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్ తెలిపారు. ఇట్టి భూమిని వరిధాన్య కొనుగోలు సెంటర్ మరియు సమ్మక్క సారలమ్మ జాతరకు అందించి నటువంటి మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్ మరియు గ్రామ ప్రజలు అందరూ ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని 23/01/2026 శుక్రవారం రోజున రాత్రి 10 గంటలకు కొబ్బరికాయ కొట్టి సర్పంచ్ దాసరి తిరుపతి ఉప సర్పంచ్ దిటీ మహేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండి కొమురయ్యావార్డు సభ్యులు ఓరగంటి మనీషా శ్రీకాంత్ ఓరగంటి లచ్చయ్య తాండ్ర స్వామి మరియు సంపంగి శ్రీను ముద్దం సాయికుమార్ , మెన్గు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *