ఇందిరా మహిళ శక్తి సంబురాలు మహిళ స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణి

★ముఖ్య అధితులు గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి రాయికల్ మండలంలోని స్థానిక పద్మశాలి సేవా సంఘం లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళ శక్తి సంబరాలు రాయికల్ పట్టణ మహిళల స్వశక్తి సంఘాల సభ్యులకు వడ్డీ లేని ఋణాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 సంఘాలకు సుమారు 11 లక్షల రూపాయల వడ్డీలేని రుణాల జంబో చెక్కును మహిళలకు అందజేసి మరియు 7 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళ శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మహిళా స్వశక్తి సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి,చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించుకునేలా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు.మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటివారని,వారు బలపడితే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతా యని పేర్కొన్నారు గత ప్రభుత్వాలకంటే భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు.రాయికల్ పట్టణ మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని,స్వయం ఉపాధితో పాటు ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు.మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.