ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో కూలీగా మారిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్…

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 25/2026, ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ ఏడో వార్డ్ నందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంటే అక్కడున్న కూలీలను ఇంటి యజమానిని అడిగి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఉన్న లోపాలను అడిగి తెలుసుకున్నారు దాంట్లో భాగంగా వారు మాకు చాలా చక్కగా ఉంది ఇట్లాంటి స్కీమ్ పెట్టడం మా అదృష్టమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా అక్కడ కూలీలతో కలిసి బొచ్చ మోసి కూలీగా మారిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…