ఆలయ అభివృద్ధిలో భాగం కావడం సంతోషకరం: పానుగంటి బాబు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 రిపోర్టర్ కిరణ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ ముత్తుస్వామి కాలనీలో ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు
21, 000/- రూపాయలను విరాళంగా సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముత్యాలమ్మ దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ముత్యాలమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని, భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు.