ఆర్థిక సాయం అందజేసిన ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి, వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన సూరారం రాములు అనారోగ్యంతో ఇటీవల మరణించగా పేద కుటుంబానికి చెందిన వారు అని గ్రామస్తులు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి కి సమాచారం తెలుపగా వెంటనే ఏజేఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సమకూర్చిన 5000 రూపాయలను శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, సాయి, పోలేపాక శంకర్ ,పోలేపాక సాయిలు, గోపాల్, లింగస్వామి, జనగం నాగేష్ ,సూరారం మధు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.