ఆదోని జిల్లా గా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

★జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 25, మండల కేంద్రమైన హోళగుంద లోనీ వాల్మీకి సర్కిల్ నందు జేఏసీ కమిటీ పిలుపు మేరకు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ కమిటీ సభ్యులు షఫీఉల్లా ఎస్ఎఫ్ఐ గిరి శనివారం మాట్లాడుతూ ఆదోని జిల్లా గా ప్రకటించాలని లేనియెడల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఆదోని రెండవ ముంబాయి గా పేరుపొందిన ఆదోని ని జిల్లా చేస్త ఐదు నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయన్నారు ప్రతి చిన్న పనికి కర్నూలు వెళ్లాలంటే సమయం వృధా అవుతుందని అదే ఆదోని జిల్లా అయితే పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుంద న్నారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆదోని జిల్లా కోసం 65రోజుల నుంచి ప్రతి నియోజకవర్గంలో దీక్షలు కొనసాగుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ వెంటనే ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు శేషప్ప ముద్దప్ప ఈరన్న ఇమ్రాన్ గదిలింగ కళింగ భాషా నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.