అన్నమయ్యపురంలో వైభవంగా స్వరార్చన​

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25, (శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో శోభారాజు ఆధ్వర్యంలో శనివారం అన్నదానం, అన్నమ స్వరార్చన కార్యక్రమాలు నిర్వహించారు. 150 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ అనంతరం, శ్రీ కళ్యాణి మ్యూజిక్ అకాడమీ గురువులు బి.వి. రమణమూర్తి, శారద మార్గదర్శకత్వంలో శిష్యులు రిషిక, రవితేజ బృందం అన్నమయ్య సంకీర్తనలతో స్వామివారికి స్వరసేవ చేశారు. తబలా, వీణ, కీబోర్డ్ వాయిద్య సహకారంతో సాగిన ఈ వేడుకలో కళాకారుల ప్రతిభను శోభారాజు ప్రశంసించారు. అనంతరం శోభారాజు, నంద కుమార్ కలిసి పాల్గొన్న కళాకారులను జ్ఞాపికలతో సత్కరించారు. మంగళహారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.