సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 25 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండల కేంద్రంలోని టీజేఎన్ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సాక్షి వారి సౌజన్యంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ-విద్యార్థులకు మెటీరియల్స్ నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటర బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముందుగా జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ“వెలకట్టలేనిది చదువు, నలుగురికి పంచే కొద్దీ పెరిగేది చదువు. జీవితంలో మనల్ని ఒక మహోన్నత స్థాయిలో నిలబెట్టేది ఒక్క చదువే” అని విద్యార్థులకు హితవు పలికారు.ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ-విద్యార్థులు ఈ కీలక దశలో మరింత కష్టపడి చదివి, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.