అందర్నీ ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు….

★క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం…. ★ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభం….. ★మరికల్ ఎంపీడీవో పృథ్విరాజ్ ……

సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 25, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరికల్ ఎంపీపీ కాంప్లెక్స్ లోని కార్యాలయ సిబ్బంది కి ఆట పోటీలు నిర్వహించడం జరిగినది. ఇందులో క్రికెట్ ఆటలో తాసిల్దార్ రామకోటి,ఎంపీడీవో పృథ్వీరాజ్ కార్యాలసిబ్బంది తలపడగా ఎంపీడీవో సిబ్బంది జట్టు విజయం సాధించింది. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు రంగవల్లి పోటీలు కూడా నిర్వహించడం జరిగినది ఇందులో మహిళా సమాఖ్య సభ్యులు తాసిల్దార్ మహిళా ఉద్యోగులు ఎంపీడీవో అభ్యర్థి మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. చాలా అద్భుతంగా వారి వారి శాఖల గురించి రంగవల్లి రూపంలో వివరించడం జరిగినది. ఇట్టే ఆట పోటీలు నిర్వహణలో మండల ప్రత్యేక అధికారి మరియు తాసిల్దారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల పంచాయతీ అధికారి కాంప్లెక్స్ ఉద్యోగులు పాల్గొనడం జరిగినది. ఈ ఆట పోటీలు గెలిచిన వారికి జనవరి 26వ రోజు బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.