అంతరాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

★తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

సాక్షి,డిజిటల్ న్యూస్ ,జనవరి, 25,2026 అంతరాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో 3.44 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్తు ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు, రైతంగానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించేందుకు ఈ విద్యుత్తు ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గృహ,వ్యవసాయ భూములకు కరెంటు కష్టాలు తీరునున్నాయన్నారు.కార్యక్రమంలో సూపరిండెంట్ ఇంజనీర్ సురేష్, డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బానోత్ బాలు నాయక్, అసిస్టెంట్ ఇంజనీర్ భూక్య ఉమా, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పోలబోయిన లింగయ్య యాదవ్,మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలెంల విద్యాసాగర్, చిత్తలూరు సోమన్న, కోటమర్తి సర్పంచ్ పాశం విష్ణువర్ధన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ హనుమంతరావు,వేల్దివి సర్పంచ్ రాచకొండ రమేష్,కంచన పెళ్లి సర్పంచ్ చెడే అంబేద్కర్, అజీం పేట సర్పంచ్ కన్నెబోయిన లింగస్వామి యాదవ్ , రేపాక సర్పంచ్ ముక్కాముల శ్రీకాంత్ యాదవ్ సర్పంచ్ , పాశం సత్యనారాయణ, ఇంచార్జ్ ఎంపీడీవో దేవేందర్ రావు , ఎమ్మార్వో శేషగిరిరావు, లైన్మెన్లు బెజ్జంకి ఉపేంద్ర చారి, కత్తి కాంతారావు, ఎస్కే కాజా, నవిలే రామచంద్రయ్య, మాలోతు వెంకన్న, కేశగండ్ల మచ్చ గిరి,ఆర్టిజన్లు: తుప్పతి బీరప్ప, నూకల నరసయ్య, మారిశెట్టి అశోక్, నిమ్మల నరేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.