అంగన్వాడీ కేంద్రంలో బాలికల దినోత్సవం సందర్భంగా

★సామూహిక శ్రీమంతాలు నిర్వహించిన టీచర్లు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, ఆందోల్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ మల్లేశం, ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరదిలోని సూరంపల్లి గ్రామాల పరదిలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మైలారం పోచయ్య మాట్లాడుతూ కిషోరబాల బాలికలకు అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి గర్భిణీ స్త్రీలకు పండ్లు పూలు అందజేసి ఆశీర్వదించారు మహిళలు శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంజరిగిందన్నారు గర్భిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అరవింద్ ఎంఎల్ హెచ్ పి పృథ్వి అంగన్వాడీ టీచర్ అనురాధ వెలుగు సంగం సభ్యులు సత్తమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.