సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు జనవరి 20 2026: నందిగామ పట్టణ శివారు చందాపురం గ్రామం వద్ద గల"హజరత్ సయ్యద్ బాలే మస్తాన్ షా వలి (ర.అ)"వారి 41 వ ఉర్సు మహోత్సవములు గురు, శుక్రవారాలలో జరగనున్నాయని దర్గా కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ (పితాన్ మేస్త్రి) సోమవారం తెలిపారు. 22వ తేదీ గురువారం దర్గా షరీఫ్ ముజావర్ సయ్యద్ సర్దార్ ఇంటి వద్ద నుండి దర్గా కమిటీ గౌరవ అధ్యక్షులు, పట్టణ ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్బోర్డు కౌన్సిల్ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో సన్నాయి మేళాలతో "గంధం" ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. అదేవిధంగా 23వ తేదీ శుక్రవారం సాయంత్రం దర్గా షరీఫ్ వద్ద హజ్రత్ వారి "దీపారాధన" కార్యక్రమం దర్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ బాజీ ఎండి మహమూద్ షేక్ ఇమామ్ హుస్సేన్ షేక్ సమీర్ తదితరుల పర్యవేక్షణలో జరుగుతుందని పితాన్ మేస్త్రి తెలియజేశారు.