సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం 20.01.26: ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలు ను రైతులు సద్వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పుష్ప అన్నారు. మండలంలో జరిగే పసి వైద్య శిబిరాలను సోమవారం గొల్లలపాలెం గ్రామంలో ప్రారంభించారు. సహాయ సంచాలకులు డా.పుష్ప,వైద్యులు డా. బాలతేజ, డా.నూకేష్, డా.దమయంతి ఎంపీటీసీ సూర్యనారాయణ తదితరులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు, సిబ్బంది రెండు బృందాలుగా రోజుకు రెండు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తారన్నారు. సోమవారం గొల్లలపాలెం మరియు కొట్నబిల్లి గ్రామాల్లో రెండు బృందాలుగా వెటర్నరీ సిబ్బంది నిర్వహించి మందులు పంపిణీ చేపట్టారు. అలాగే వాక్సినేషన్, నట్టల నివారణ, ఎద మందులు , వైద్య సేవలు ఉచితంగా అందించారు.రైతులు పలువురు పాల్గొన్నారు. శేషు రావికమతం.