108/102 అంబులెన్స్ సేవలు భేష్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె.రవి

సాక్షి డిజిటల్ న్యూస్ 20.01.26, జిల్లా వనపర్తి మండలం చిన్నంబావి రిపోర్టర్ క్రాంతి కుమార్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108 మరియు 102 అంబులెన్స్లు అత్యుత్తమంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె రవి పేర్కొన్నారు, సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలోని 108/102 అంబులెన్స్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు, అంబులెన్స్ లోని వివిధ రకాల పరికరాల పనితీరు మరియు మందులను పరిశీలించడం జరిగింది, 108 అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నామని ప్రమాద బాధితులను ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు, 102 అమ్మఒడి అంబులెన్సులు గర్భిణీ స్త్రీలు పరీక్షలు నిమిత్తం వాడుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను ఇంటిదగ్గర దించడానికి మరియు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం అమ్మఒడి వాహనాలను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు, ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెహబూబ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శ్రీధర్ పైలెట్ రాఘవేంద్ర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *