సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 వేములవాడ ఆర్. సి.ఇంచార్జ్ సయ్యద్ షబ్బీర్. వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల లో ప్రజాకవి, తాత్వికవేత్త యోగివేమన జయంతి సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, విద్యార్థులకు వేమన పద్యాల పోటీ నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “వానకు తడవని వారు, వేమన పద్యం రాని తెలుగువారు ఉండరని లోకోక్తి అని, వేమన పేరు తెలియని వారు ఉండరని, వేమన సమాజంలో మూఢనమ్మకాలను, మూఢాచారాలను, కట్టుబాట్లను చావు దెబ్బతీస్తూ ఆటవెలది పద్యాలలో నిజాలను నిర్భయంగా వెల్లడించిన సాంఘిక విప్లవకారుడు అని, ప్రజల భాషకు పట్టం కట్టిన ప్రజాకవి అని, ‘విశ్వదాభిరామ వినురవేమ’ మకుటంతో సరళమైన ఆటవెలది పద్యాలలో లోకజ్ఞానాన్ని, జీవన సత్యాలను ,సామాజిక రుగ్మతలను బోధించారని, మూఢనమ్మకాలను, కుల వ్యవస్థను వ్యతిరేకించారని, యోగిగా మారి తపస్సు చేసి తన పద్యాల ద్వారా ప్రజలకు నైతిక విలువలు, నిజ జీవిత సారాంశాన్ని తెలియజేశారని, వేమన కడప జిల్లాలోని గండికోటలో జన్మించారని, వేమన యవ్వనంలో వేశ్యాలోలుడిగా ఉన్నప్పటికీ, తర్వాత విరక్తి చెంది యోగిగా మారారని, పామరులకు కూడా సులభంగా అర్థమయ్యేలా తేలికైన పదాలతో పద్యాలు రాశారని, ఎక్కువగా ఆటవెలది చందస్సును ఉపయోగించారని, ప్రతి పద్యం చివర ‘విశ్వదాభిరామ వినురవేమ’ అని ఉంటుందని, దీని అర్థం ప్రపంచానికి ప్రియమైనవాడా, వేమా విను అని, వేమన కుల వ్యవస్థను, సామాజిక అసమానతలను ఖండించారని, విగ్రహారాధన, చాందస భావాలను వ్యతిరేకించారని, నైతిక విలువలు, నిజమైన జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారని, సామాన్య ప్రజల భాషలో, వారి సమస్యలపై పద్యాలు రాసినందున వేమనను ‘ప్రజాకవి’ అంటారని, తెలుగు సాహిత్యంలో గొప్ప సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారని, తెలుగువారికి తత్వవేత్తగా, యోగిగా, కవిగా నిలిచారని, అందుకే ఆయనను “ఆంధ్ర కబీర్” గా కూడా పిలుస్తారని, వేమన పద్యాలు ఆ చంద్రార్కం చుక్కల్లో చంద్రుడిలా ఈరోజుకి కూడా వెలిగిపోతూనే ఉన్నాయని, విశ్వదాభిరామ వినురవేమ మనందరి మదిలో చెరగని ముద్ర అని, భారత సాహిత్య చరిత్రలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించి సమానత్వం కోసం ప్రజాస్వామ్య, గణతంత్ర విలువల రక్షణ కోసం పాటుపడిన ఎందరో ప్రముఖ కవులలో మహానుభావులు యోగివేమన సుప్రసిద్ధులు అని, దేశంలో ఉన్న కుల అసమానతల కారణంగా తరతరాలుగా కులం మూలంగా సమాజంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన రాకుండా కులం అడ్డు పడుతుండగానే సత్యాన్ని గ్రహించిన వేమన అసమానతల పట్ల విరక్తి చెందాడని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని వేమన మెప్పించి మేల్కొల్పాడని, ఆట వేలదితో అద్భుతమైన కవిత్వాన్ని వేమన ఆవిష్కరించారని, ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించి వేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుందని” పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.