సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్: గుండాల మండల కేంద్రంలోని వడ్డరి కాలనీలో ఉన్న అంగన్వాడి సెంటర్లో గుండాల గ్రామ సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య చిన్నారికి అన్న ప్రాసన చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మీ చిన్నారులకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పోషకాలతో కూడుకున్న వివిధ రకాల పౌష్టికాహారాన్ని చిన్నారులకు అందించాలని అన్నారు. అంగన్వాడి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభించామని త్వరలో పూర్తి చేసి పాఠశాలను నూతన భవనం ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో,వార్డు సభ్యులు పండుగ ఉపేందర్ చిన్న పిల్ల తల్లులు చిన్నారులు పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత ఆశ లు కలమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు.