వేలాడుతూ ప్రయాణం

★ వెంటాడే ప్రమాదం.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 పాలకొండ నియోజకవర్గ ఇంచార్జి గంగాడ గౌరీ శంకర్: మండలంలోని మామిడి వలస లాభాం అల్లిన బూర్జ తోటవాడ అన్నం పేట సమీప సమీప పాలకొండ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణాలకు వెళ్లేందుకు ప్రధాన కూడళ్ళు వరకు ఇలా ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. మండల కేంద్రం నుండి, ఇతర గ్రామాల నుండి సమీప పట్టణాలకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయవలసి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఆయా గ్రామాలకు బస్సులు లేకపోవడంతో ఇతర ప్రాంతం నుండి పండగ వచ్చే గ్రామస్తులు ఇలా ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు నుండి గిరిజనలు జరిగే వారపు సంతకు ఇలా ప్రయాణం చేస్తున్నారు వేలాడుతూ ప్రయాణం ప్రమాదకరమని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆర్టిసి బస్సులు నడపాలని మండల ప్రజలు కోరుతున్నారు.